Showing posts with label తెలుగు. Show all posts
Showing posts with label తెలుగు. Show all posts

Thursday, February 21, 2008

బిందాస్

సమస్య = పరిష్కారం
సమస్య లేకపోతే పరిష్కారం అనే మాటే లేదు.
పరిష్కరించలేని సమస్యే లేదు.

మరి ఆ రెండు భావనలు అంత అన్యోన్యంగా ఉంటే, మనమెందుకండీ సమస్యని చూసి తల్లడిల్లడం...

"తారే జమీన్ పర్" మూవీలో చెప్పినట్లు "బిందాస్"గా ఉందాం...

Friday, February 8, 2008

ఓ మనసా కాసేపు విశ్రాంతి తీసుకోవా?

ఓ మనసా కాసేపు విశ్రాంతి తీసుకోవా?

ఆనందంలో ఉయ్యాలలూగిస్తావు..
అంతలోనే ఊచకోత కోస్తావు...

అందనంత ఎత్తుకు తీసుకువెళ్తావు..
అథ:పాతాళానికి తోసేస్తావు...

ఆశలు రేపుతావు..
అవహేళన చేస్తావు...

నేను నీ చేతిలో ఆటబొమ్మనా - ఎంత మాత్రం కాదు..

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. కడదాకా పోరాడతా...



పాజిటివ్ వర్షన్(నవీన్ గార్ల గారికి ధన్యవాదాలు)
-----------------------------
ఊచకోత కోస్తావు...
అంతలోనే ఆనందంలో ఉయ్యాలలూగిస్తావు..

అథ:పాతాళానికి తోసేస్తావు...
అందనంత ఎత్తుకు తీసుకువెళ్తావు..

అవహేళన చేస్తావు...
ఆశలు రేపుతావు..

మనం చూసేదాన్ని బట్టే జీవితం :)

Thursday, June 28, 2007

అంతా మన మంచికే

జరిగిందేదో మన మంచికే జరిగింది...
జరుగుతున్నదీ మన మంచికే ,జరుగబోయేది మంచికే జరుగుతుంది...
నీవేమీ పొగొట్టుకున్నావని విచారిస్తున్నావు...
నీవేమి తెచ్చవని పొగొట్టుకుంటావు...

నీవేమి సృష్టించావని,నీకు నష్టం వాటిల్లింది...
నీవు ఏదైతే సంపాదించావో ,అది ఇక్కడి నుండే సంపాదించావు...
ఏదైతే ఇచ్చావో అది ఇక్కడే ఇచ్చావు...

ఇప్పుడు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం కాదా?
అదే రేపు మరొకరి సొంతం కాగలదు...

మార్పు ప్రకృతి సహజం ..... గీత సారాంశం

Thursday, March 22, 2007

ఎక్కడికో నా ఊహల ప్రయాణం?

ఒంటరిగా మిగిలిన ఆ అమావాస్య నిశీధి వేళ
లోకమంతా పరుచుకున్న చిక్కటి చీకటిలో
దూరాన వున్న మిణుగురు పురుగు నాకు ఆశాకిరణమై

ఊహలు ఊహించే మరో లోకానికి
పరుగు పెట్టమని ప్రోత్సహిస్తోంది

కలలు కోరుకునే ఆ కొత్త లోకానికి
మనసు ముందే చేరుకుని స్వాగతాన్ని పలుకుతోంది

ప్రపంచమంతా పంచుకుంటున్న వెన్నెల వెలుగులో
నా భాగం కనుమరుగైంది

చుట్టూ అందరూ వున్నా ఎవరూ ఏమీ కారని
తెలుసుకున్న మనసు తట్టుకోలేకపోతోంది

కళ్ళలో ఇమిడిన కన్నీటి కడలి
కారు మబ్బులతో నిండిన ఆకాశాన్ని తలపిస్తోంది

By,
Siva Parvathi

Wednesday, March 7, 2007

ప్రకృతిని చూసి నేర్చుకో

పూసే ప్రతి పువ్వుని చూసి
అందరినీ చిరునవ్వుతో పలకరించాలని నేర్చుకో
వీచే గాలిని చూసి
అందరికీ ఆప్తుడవై ఆదుకోవాలని నేర్చుకో

సూర్యుని ప్రభాతం చూసి
బాధ్యతలని ఎన్నటికీ మరువకూడదని నేర్చుకో
చంద్రుని ప్రకాశం చూసి
చీకటి నిండిన దారిలో వెలుగును పంచే దివ్వెవు కావాలని నేర్చుకో

జల జల పారే సెలయేరుని చూసి
ఎన్ని అడ్డంకులు ఎదురైనా సాగిపోయే ఆత్మస్థైర్యాన్ని నేర్చుకో
కదలని కడలిని చూసి
కష్టాలలో సైతం సడలని ఆత్మవిశ్వాసాన్ని నేర్చుకో

Author : Parvathi

Friday, February 16, 2007

అహంభావ శోధన (Ego Search)

ఇదేం గోలరా బాబు అనుకుంటున్నారా? ఎవరి పేరును వారు ఇంటర్నెట్ లో వెతకడమే ఈగో సెర్చ్. ఉదాహరణకు మీ పేరును ఇంటి పేరుతో సహా గూగుల్ సెర్చ్ లో కొట్టండి, మీ గురించి మీక్కూడా తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడవచ్చు. నేనైతే ప్రతి రోజు ఈ శోధన చేస్తూ ఉంటా! ఎంతైనా ఎవరి పేరు వారికి ముద్దు కదండీ! :)

Monday, February 12, 2007

ప్రేమ ఎక్కడుంది?

మారాం చేసే చిన్నారికి అమ్మ చెప్పే చందమామ కధలలో వుంది....
తన బిడ్దకి లోక జ్ఞానం నేర్పించాలనే ఆశ!!

ఖాళీగా వున్నప్పుడు నాన్న అప్పగించే పనులలో వుంది........
తన వారికి బాధ్యత అంటే ఎమిటో తెలియజెప్పాలనే తపన!!

పరీక్ష తప్పిన పిల్లవాడికి గురువు విధించే శిక్షలో వుంది.........
తన విద్యార్ధిని ఆదర్శ పౌరుడిగా తీర్చిదిద్దాలనే కోరిక!!

సైన్యంలో చేరిన జవానుకి ఇచ్చే కష్తమైన శిక్షణలొ వుంది........
తన జన్మభూమిని కంటికి రెప్పలా కాపడతాడనే విశ్వాసం!!

ఏపుగా పెరిగిన పంటకి విషం ఇచ్చే రైతు మనసులో వుంది.....
తన పంట పురుగు బారిన పడకూడదనే జాగ్రత్త!!

సమస్యలని సౄష్టించే ఆ దేవుని చర్యలో వుంది......
ప్రతి మనిషి వలయాన్ని చేధించి ధీరుడు అవుతాడనే నమ్మకం!!

Author : Parvathi ( My good friend)

Wednesday, February 7, 2007

జీవితం

రెప్ప తెరిస్తే జననం
రెప్ప మూస్తే మరణం
రెప్ప పాటులో ముగిసిపోయే ఈ జీవితం మీద ఎందుకింత ఆశ?

ఏంటి మనోడికి ఏమి అయ్యింది ఇవ్వాళ అనుకుంటున్నారా?
ఏదో సినిమాలో డైలాగ్ గుర్తుకొచ్చింది లెండి.

Thursday, February 1, 2007

నాకు ఎంతో ఇష్టమైన పాట

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం నుండి జాలువారిన ఒక ఆణిముత్యం

జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే

కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
నాతో నేను అనుగమిస్తు నాతో నేనే రమిస్తూ
వంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం

మింటికి కంటిని నేనై , కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని
చరణాల చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని

గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె

Wednesday, January 31, 2007

పొగ త్రాగితే?

ముంబయిలో ఒక ఐటి కంపెని స్మోకర్స్ జోన్లో గోడ మీద వేసిన బొమ్మ ఇది. మంచి ఆలోచన కదండీ!!

Tuesday, January 30, 2007

వెన్నెల్లోఆడపిల్ల

ఇవ్వాళ ఏమి రాద్దాం అని ఆలోచిస్తుండగా ఎందుకో మన యండమూరి వారి వెన్నెల్లోఆడపిల్ల గుర్తుకొచ్చింది. ఆ నవల చదివిన రోజు మనసంతా ఏదో తెలియని భావంతో నిండి పోయింది. కథానాయిక పాత్రను ఒక శిల్పం లాగా మలిచారు. మన హీరో గొప్ప చెస్ ఆటగాడు , ఆమె అమెరికాలో గొప్ప చదువు చదివిన అందాలరాశి. ఆ అమ్మాయి మన చెస్ ఛాంపియన్ తో ఆడిన మైండ్ గేం మీ మనసును దోచుకుంటుంది. ముగింపు ఎలాంటి వారినైనా కదిలిస్తుంది. నాకు ఎప్పుడూ అనిపిస్తుంటుంది తెలుగే కనుక అంతర్జాతీయ భాష ఐతే మన వీరేంద్రనాథ్ గారికి ఎంత గుర్తింపు వచ్చి వుండేదో అని. ఈ నవల ఆధారంగా ఒక సీరియల్ మరియు సినిమా (హలో ఐలవ్ యు) వచ్చాయి , కాని దురదౄష్టవశాత్తు దానికి న్యాయం చేకూర్చలేకపోయాయి.

Sunday, January 28, 2007

ఈ బ్లాగ్ ని కార్గిల్ యుద్ధ౦తో ప్రార౦భిద్దా౦

అనన్య పోరాటానికి అది ఆర౦భ౦
అచ౦చల దేశభక్తికి అది ప్రతిబింబం

మాతృభూమి కోసం శ్రమిస్తున్నాననే ప్రతి సైనికుడి తపన
వంద కోట్ల భారతీయులకు మరువలేని దీవెన

తమ ప్రాణాలను పరుల శ్రేయస్సు కోసం అర్పించే ఆ త్యాగం
భరతమాత బిడ్డలమైన మేము ఎన్నడు మరువం

తూటా దిగినప్పుడు వందేమాతరం అని చేసే సింహగర్జన
శత్రు సైనికుల గుండెల్లో లేపుతుంది వేదన

పాకిస్తాన్ మిలిటెంట్లను తరిమికొట్టిన ఆ ప్రతాపం
భావి భారత పౌరులకు కావాలి ఆదర్శం