Showing posts with label కవిత. Show all posts
Showing posts with label కవిత. Show all posts

Friday, February 8, 2008

ఓ మనసా కాసేపు విశ్రాంతి తీసుకోవా?

ఓ మనసా కాసేపు విశ్రాంతి తీసుకోవా?

ఆనందంలో ఉయ్యాలలూగిస్తావు..
అంతలోనే ఊచకోత కోస్తావు...

అందనంత ఎత్తుకు తీసుకువెళ్తావు..
అథ:పాతాళానికి తోసేస్తావు...

ఆశలు రేపుతావు..
అవహేళన చేస్తావు...

నేను నీ చేతిలో ఆటబొమ్మనా - ఎంత మాత్రం కాదు..

వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు.. కడదాకా పోరాడతా...



పాజిటివ్ వర్షన్(నవీన్ గార్ల గారికి ధన్యవాదాలు)
-----------------------------
ఊచకోత కోస్తావు...
అంతలోనే ఆనందంలో ఉయ్యాలలూగిస్తావు..

అథ:పాతాళానికి తోసేస్తావు...
అందనంత ఎత్తుకు తీసుకువెళ్తావు..

అవహేళన చేస్తావు...
ఆశలు రేపుతావు..

మనం చూసేదాన్ని బట్టే జీవితం :)

Thursday, March 22, 2007

ఎక్కడికో నా ఊహల ప్రయాణం?

ఒంటరిగా మిగిలిన ఆ అమావాస్య నిశీధి వేళ
లోకమంతా పరుచుకున్న చిక్కటి చీకటిలో
దూరాన వున్న మిణుగురు పురుగు నాకు ఆశాకిరణమై

ఊహలు ఊహించే మరో లోకానికి
పరుగు పెట్టమని ప్రోత్సహిస్తోంది

కలలు కోరుకునే ఆ కొత్త లోకానికి
మనసు ముందే చేరుకుని స్వాగతాన్ని పలుకుతోంది

ప్రపంచమంతా పంచుకుంటున్న వెన్నెల వెలుగులో
నా భాగం కనుమరుగైంది

చుట్టూ అందరూ వున్నా ఎవరూ ఏమీ కారని
తెలుసుకున్న మనసు తట్టుకోలేకపోతోంది

కళ్ళలో ఇమిడిన కన్నీటి కడలి
కారు మబ్బులతో నిండిన ఆకాశాన్ని తలపిస్తోంది

By,
Siva Parvathi

Wednesday, March 7, 2007

ప్రకృతిని చూసి నేర్చుకో

పూసే ప్రతి పువ్వుని చూసి
అందరినీ చిరునవ్వుతో పలకరించాలని నేర్చుకో
వీచే గాలిని చూసి
అందరికీ ఆప్తుడవై ఆదుకోవాలని నేర్చుకో

సూర్యుని ప్రభాతం చూసి
బాధ్యతలని ఎన్నటికీ మరువకూడదని నేర్చుకో
చంద్రుని ప్రకాశం చూసి
చీకటి నిండిన దారిలో వెలుగును పంచే దివ్వెవు కావాలని నేర్చుకో

జల జల పారే సెలయేరుని చూసి
ఎన్ని అడ్డంకులు ఎదురైనా సాగిపోయే ఆత్మస్థైర్యాన్ని నేర్చుకో
కదలని కడలిని చూసి
కష్టాలలో సైతం సడలని ఆత్మవిశ్వాసాన్ని నేర్చుకో

Author : Parvathi

Monday, February 12, 2007

ప్రేమ ఎక్కడుంది?

మారాం చేసే చిన్నారికి అమ్మ చెప్పే చందమామ కధలలో వుంది....
తన బిడ్దకి లోక జ్ఞానం నేర్పించాలనే ఆశ!!

ఖాళీగా వున్నప్పుడు నాన్న అప్పగించే పనులలో వుంది........
తన వారికి బాధ్యత అంటే ఎమిటో తెలియజెప్పాలనే తపన!!

పరీక్ష తప్పిన పిల్లవాడికి గురువు విధించే శిక్షలో వుంది.........
తన విద్యార్ధిని ఆదర్శ పౌరుడిగా తీర్చిదిద్దాలనే కోరిక!!

సైన్యంలో చేరిన జవానుకి ఇచ్చే కష్తమైన శిక్షణలొ వుంది........
తన జన్మభూమిని కంటికి రెప్పలా కాపడతాడనే విశ్వాసం!!

ఏపుగా పెరిగిన పంటకి విషం ఇచ్చే రైతు మనసులో వుంది.....
తన పంట పురుగు బారిన పడకూడదనే జాగ్రత్త!!

సమస్యలని సౄష్టించే ఆ దేవుని చర్యలో వుంది......
ప్రతి మనిషి వలయాన్ని చేధించి ధీరుడు అవుతాడనే నమ్మకం!!

Author : Parvathi ( My good friend)

Sunday, January 28, 2007

ఈ బ్లాగ్ ని కార్గిల్ యుద్ధ౦తో ప్రార౦భిద్దా౦

అనన్య పోరాటానికి అది ఆర౦భ౦
అచ౦చల దేశభక్తికి అది ప్రతిబింబం

మాతృభూమి కోసం శ్రమిస్తున్నాననే ప్రతి సైనికుడి తపన
వంద కోట్ల భారతీయులకు మరువలేని దీవెన

తమ ప్రాణాలను పరుల శ్రేయస్సు కోసం అర్పించే ఆ త్యాగం
భరతమాత బిడ్డలమైన మేము ఎన్నడు మరువం

తూటా దిగినప్పుడు వందేమాతరం అని చేసే సింహగర్జన
శత్రు సైనికుల గుండెల్లో లేపుతుంది వేదన

పాకిస్తాన్ మిలిటెంట్లను తరిమికొట్టిన ఆ ప్రతాపం
భావి భారత పౌరులకు కావాలి ఆదర్శం