Thursday, March 22, 2007

ఎక్కడికో నా ఊహల ప్రయాణం?

ఒంటరిగా మిగిలిన ఆ అమావాస్య నిశీధి వేళ
లోకమంతా పరుచుకున్న చిక్కటి చీకటిలో
దూరాన వున్న మిణుగురు పురుగు నాకు ఆశాకిరణమై

ఊహలు ఊహించే మరో లోకానికి
పరుగు పెట్టమని ప్రోత్సహిస్తోంది

కలలు కోరుకునే ఆ కొత్త లోకానికి
మనసు ముందే చేరుకుని స్వాగతాన్ని పలుకుతోంది

ప్రపంచమంతా పంచుకుంటున్న వెన్నెల వెలుగులో
నా భాగం కనుమరుగైంది

చుట్టూ అందరూ వున్నా ఎవరూ ఏమీ కారని
తెలుసుకున్న మనసు తట్టుకోలేకపోతోంది

కళ్ళలో ఇమిడిన కన్నీటి కడలి
కారు మబ్బులతో నిండిన ఆకాశాన్ని తలపిస్తోంది

By,
Siva Parvathi

1 comment:

రాధిక said...

"కలలు కోరుకునే ఆ కొత్త లోకానికి మనసు ముందే చేరుకుని ...." అద్భుతం.మిణుగురుపురుగు వాక్యం కూడా చాలా బాగుంది.